IND vs ENG: శుభారంభం దక్కింది.. భారీ స్కోరే మిగిలింది

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(47*), కేఎల్‌ రాహుల్‌(46) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు...

Updated : 04 Sep 2021 18:04 IST

మూడో రోజు నిలకడగా ఆడుతున్న టీమ్‌ఇండియా

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(47*), కేఎల్‌ రాహుల్‌(46) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. జట్టు భారీ స్కోర్‌ సాధించడానికి గట్టి పునాదులు వేశారు. ఈ క్రమంలోనే అర్ధశతకానికి చేరువైన రాహుల్‌.. అండర్సన్‌ బౌలింగ్‌లో కీపర్ బెయిర్‌స్టో చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం రోహిత్‌, పుజారా(14*) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. అలా తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి జట్టు స్కోర్‌ను 108/1కి తీసుకెళ్లారు. దీంతో టీమ్‌ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుతం 9 పరుగుల లీడ్‌ సాధించింది. ఇక రెండో రోజు చివర్లో రోహిత్‌, రాహుల్‌ 43 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని