India vs Srilanka: తొలి వన్డేకు వర్షం ముప్పు!

భారత్‌, శ్రీలంక వన్డే సిరీసుకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి వన్డే మొదలవ్వనుంది. చాన్నాళ్ల నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌ మెరుపులు లేకపోవడంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐతే.. వారిని నిరాశపరిచే వార్త!..

Updated : 18 Jul 2021 12:56 IST

జల్లులు కురిసే అవకాశం

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, శ్రీలంక వన్డే సిరీసుకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి వన్డే మొదలవ్వనుంది. చాన్నాళ్ల నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌ మెరుపులు లేకపోవడంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐతే.. వారిని నిరాశపరిచే వార్త!

తొలి వన్డే జరగనున్న ప్రేమదాస స్టేడియంలో ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరుణుడు బ్యాటింగ్‌ చేయొచ్చు! చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం కొలంబోలో ఆకాశం మేఘావృతమైంది. మైదానం చుట్టూ నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని సమాచారం.

సరిగ్గా నెల రోజుల క్రితం వరుణుడు టీమ్‌ఇండియాను ఎలా దెబ్బకొట్టాడో అందరికీ తెలిసిందే. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వర్షం ఇబ్బందిగా మారింది. మూడు రోజులు వర్షం కురవడంతో ఆట సవ్యంగా సాగలేదు. చల్లని వాతావరణం ఉండటంతో స్వింగ్‌ బౌలింగ్‌ ఆడేందుకు కోహ్లీసేన ఇబ్బంది పడింది.

ప్రేమదాసలోనూ ఇలాగే జరిగే అవకాశం ఉంది. సముద్ర తీరంలోనే ఉండటం, తేమ ఎక్కువగా ఉండటంతో బంతి స్వింగ్‌ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసే భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌ ఉండటం గబ్బర్‌సేనకు సానకూలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని