INDvsENG: షమి అర్ధ శతకం.. భోజన విరామానికి భారత్‌ 286/8

ఐదో రోజు భోజన విరామ సమయానికి భారత్‌ 286/8 స్కోర్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా(30), షమి(52) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి నాటౌట్‌ నిలిచారు...

Updated : 16 Aug 2021 18:01 IST

లండన్‌: ఐదో రోజు భోజన విరామ సమయానికి భారత్‌ 286/8 స్కోర్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా(30), షమి(52) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు 181/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో సోమవారం ఆట కొనసాగించిన టీమ్‌ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆదుకుంటాడని భావించిన పంత్‌(22) నిరాశపరిచాడు. రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో ఆట మొదలైన కాసేపటికే పెవిలియన్‌ చేరాడు. ఇషాంత్‌(16) సైతం రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దాంతో భారత్‌ 209 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆపై జోడీ కట్టిన బుమ్రా, షమి రికార్డు భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. దాంతో భారత్‌ ప్రస్తుతం 259 పరుగుల ఆధిక్యంతో మెరుగైనస్థితిలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని