IPL 2021: ముంబయి ఇండియన్స్‌ అదృష్టం వారి చేతుల్లో లేదు: చోప్రా

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌ చేరే అదృష్టం వారి చేతుల్లో లేదని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు...

Published : 03 Oct 2021 15:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌ చేరే అదృష్టం వారి చేతుల్లో లేదని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. శనివారం రోహిత్‌ సేన దిల్లీ చేతిలో ఓటమిలైన నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి తర్వాత ముంబయి 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోల్‌కతా, పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లు కూడా పది పాయింట్లతోనే సమానంగా ఉన్నా రన్‌రేట్‌ పరంగా కాస్త మెరుగ్గా ఉండటంతో అవి ముందంజలో ఉన్నాయి.

చోప్రా తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ రోహిత్‌ టీమ్‌ పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. ‘ముంబయి ఇక 16 పాయింట్లకు చేరే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే అదృష్టం కూడా వారి చేతుల్లో లేదు. ఎందుకంటే వారికి ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలో గెలిచినా 14 పాయింట్లకు మించి వెళ్లదు. ఆ జట్టుకు మరో మూడు, నాలుగు జట్లతో పోటీ ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో దిల్లీ కాస్తలో తప్పించుకుంది. గతేడాది ముంబయి ఇండియన్స్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన దిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి రోహిత్‌ జట్టును రెండుసార్లు మట్టికరిపించింది’ అని చోప్రా పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని