IPL 2021: పంజాబ్ కింగ్స్‌కు అలవాటుగా మారింది.. దృష్టి సారించాలి: కుంబ్లే
ఐపీఎల్లో స్వల్ప తేడాలతో ఓటమిపాలవ్వడం పంజాబ్‌కు అలవాటుగా మారిందని ఆ జట్టు హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో పంజాబ్ రెండు పరుగుల...
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్లో స్వల్ప తేడాలతో ఓటమిపాలవ్వడం పంజాబ్‌కు అలవాటుగా మారిందని ఆ జట్టు హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి రాజస్థాన్‌తో తలపడిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కుంబ్లే ఈ ఓటమి జీర్ణించుకోలేనిదని వ్యాఖ్యానించారు.
‘ఇలా స్వల్ప తేడాలతో ఓడిపోవడం మాకు అలవాటుగా మారింది. ముఖ్యంగా ఈ దుబాయ్ స్డేడియానికి వచ్చేసరికి ఇలా జరుగుతోందని అనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను 19 ఓవర్లలో ముగించాలని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అలాగే ఆడాలని నిర్ణయించుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తూ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లింది. చివర్లో కొన్ని బంతులే మిగిలి ఉండటంతో మ్యాచ్ గెలవడం అనేది లాటరీలా మారిపోయింది. అయితే, చివరి ఓవర్లో బౌలింగ్ చేసిన కార్తీక్ త్యాగిని మెచ్చుకోవాలి. అతడు ఆఫ్‌స్టంప్‌కు ఆవల బంతులేసినా మా బ్యాట్స్‌మెన్ ఆడలేకపోయారు. ఈ ఓటములపై దృష్టి సారించాలి. మాకింకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కానీ, ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని కుంబ్లే అభిప్రాయపడ్డారు.
అనంతరం తమ బౌలింగ్ యూనిట్‌పై స్పందించిన పంజాబ్ కోచ్.. ఇది మంచి బ్యాటింగ్ పిచ్ అని గుర్తుచేశారు. ఒకానొక సమయంలో రాజస్థాన్ 200-210 పరుగులు చేసేలా కనిపించిందని, చివరి నాలుగు ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా బంతులేసి వారిని కట్టడి చేశారని కుంబ్లే తెలిపారు. అప్పుడు 20 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీశారన్నారు. అర్ష్‌దీప్, మహ్మద్ షమి, హర్‌ప్రీత్ బ్రార్‌లను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఇక పంజాబ్ ఛేదనలో 17వ ఓవర్ వరకూ బాగానే ఆడిందని చెప్పారు. ఈ క్రమంలోనే 18, 19 ఓవర్లలో కాస్త వెనుకబడ్డట్లు పేర్కొన్నారు. ఇక చేసేది లేక మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ వెళ్లడంతో అప్పుడు రెండు వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!