
Updated : 01 Oct 2021 12:31 IST
Dravid: కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉండాలి: ఎమ్మెస్కే
దిల్లీ: రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా.. ధోని మెంటార్‌గా ఏకకాలంలో పనిచేస్తే టీమ్‌ఇండియా దశ తిరుగుతుందని సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ‘‘రవిశాస్త్రి తర్వాత టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అన్నది నా అభిప్రాయం. ద్రవిడ్ కోచ్‌గా, ధోని మెంటార్‌గా ఉంటే టీమ్‌ఇండియా దశ తిరుగుతుంది. ఇద్దరు ప్రశాంతమైన వ్యక్తులు. క్రికెట్ బాగా తెలిసినవాళ్లు. ఆటను అర్థం చేసుకోవడటంలో దిట్టలు. ఇప్పుడు వస్తున్న క్రికెటర్లందరినీ ద్రవిడే తయారు చేశాడు. ఇండియా-ఎ కోచ్‌గా యువ ఆటగాళ్లను ద్రవిడ్ సానబెట్టాడు. కోచ్‌గా ద్రవిడ్, మెంటార్‌గా ధోనీని ఎంపిక చేయకపోతే నేను నిరాశకు లోనవుతా’’ అని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.
ఇవీ చదవండి
Tags :