IPL 2021: చెన్నైపై సిక్సుల వర్షం కురిపిస్తే.. రోహిత్‌ అరుదైన రికార్డు

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. ఆదివారం చెన్నైతో తలపడే మ్యాచ్‌లో అతడు చెలరేగితే టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున అరుదైన రికార్డు నెలకొల్పనున్నాడు...

Published : 19 Sep 2021 16:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. ఆదివారం చెన్నైతో తలపడే మ్యాచ్‌లో అతడు చెలరేగితే టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున అరుదైన రికార్డు నెలకొల్పనున్నాడు. పరిమిత ఓవర్లలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టే ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ సాయంత్రం మరో మూడు సిక్సర్లు బాదితే పొట్టి ఫార్మాట్‌లో మొత్తం 400 సిక్సులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం రోహిత్‌ 397 సిక్సర్లతో కొనసాగుతున్నాడు.

కాగా, రోహిత్‌ అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 133 సిక్సర్లు సాధించగా ఐపీఎల్లో 264 సిక్సర్లు బాదాడు. అందులో ముంబయి తరఫున 254 సాధించాడు. ఇక టోర్నీ ఆరంభంలో డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టులో ఆడినప్పుడు పది సిక్సర్లు సంధించాడు. మరోవైపు రోహిత్‌ తర్వాత అత్యధిక సిక్సులు బాదింది చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా. అతడు 324 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 315 సిక్సులతో మూడు, సీఎస్కే సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ 303 సిక్సులతో నాలుగు స్థానాల్లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని