IPL 2021: దీపక్‌ చాహర్‌ జంటకు చెన్నై ‘సూపర్‌ కింగ్స్‌ సెలబ్రేషన్స్‌’

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ గురువారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం తన స్నేహితురాలు జయ భరద్వాజ్‌కు ప్రపోజ్‌ చేశాడు. మైదానంలోని స్టాండ్స్‌ దగ్గరకు వెళ్లి ఆమె ముందు మోకాలిపై...

Published : 08 Oct 2021 15:02 IST

(Photo: CSK Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ గురువారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం తన స్నేహితురాలు జయ భరద్వాజ్‌కు ప్రపోజ్‌ చేశాడు. మైదానంలోని స్టాండ్స్‌ దగ్గరకు వెళ్లి ఆమె ముందు మోకాలిపై నిలబడి ‘పెళ్లి చేసుకుంటావా’ అని ప్రతిపాదించాడు. ఊహించని ఈ పరిణామంతో ఆనందంలో మునిగిపోయిన ఆమె వెంటనే అతడి ప్రేమను అంగీకరించింది. దీంతో ఇద్దరూ హత్తుకొని ముద్దులు పెట్టుకున్నారు. ఆ వీడియోను దీపక్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

ఇక వీరిద్దరూ హోటల్‌కు చేరగానే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు, జట్టు యాజమాన్యం అదిరిపోయే రేంజ్‌లో వేడుక నిర్వహించింది. ఈ ప్రేమ జంట కోసం ప్రత్యేకంగా డెకరేషన్‌ చేయించి కేక్‌ కట్‌ చేయించింది. అనంతరం చెన్నై ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలారు. కాగా, ఈ వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. అభిమానులు సూపర్‌ జంట అంటూ కామెంట్లు చేస్తూనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాహర్‌ ఎప్పటిలానే ఈ సీజన్‌లోనూ చెన్నై తరఫున చెలరేగుతున్నాడు. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని