Mohammed Shami: ఈ మాత్రం దానికే దిగులెందుకు? ఇంకా టైం ఉందని షమి భరోసా

మూడో టెస్టులో పేలవ ప్రదర్శన తమపై ఎలాంటి ప్రభావం చూపించలేదని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి అన్నాడు. కొన్నిసార్లు సుదీర్ఘ ఫార్మాట్లో చెడ్డ రోజులు ఎదురవుతాయని తెలిపాడు....

Published : 27 Aug 2021 10:44 IST

లీడ్స్‌: మూడో టెస్టులో పేలవ ప్రదర్శన తమపై ఎలాంటి ప్రభావం చూపించలేదని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి అన్నాడు. కొన్నిసార్లు సుదీర్ఘ ఫార్మాట్లో చెడ్డ రోజులు ఎదురవుతాయని తెలిపాడు. ఐదు టెస్టుల సిరీసులో ఇంకా సమయం మిగిలే ఉంది.. ఆటగాళ్లు దిగులు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

‘లేదు, మిత్రమా! ప్రస్తుత ప్రదర్శన మాపై మానసికంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదు. మేం మూడు రోజుల్లో మ్యాచులు ముగించాం. కొన్ని సార్లైతే రెండు రోజుల్లోనే ముగించేశాం. కొన్నిసార్లు చెడ్డ రోజులు ఎదురవుతాయి. టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సుల్లో త్వరగా ఆలౌటై ఎక్కువసేపు ఫీల్డింగ్‌ చేశాం’ అని షమి అన్నాడు.

‘కొన్నిసార్లు ఇలా అవుతుంది. అంత మాత్రానికే ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా సిరీసులో రెండు టెస్టులు మిగిలే ఉన్నాయి’ అని షమి తెలిపాడు. ‘మేం సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉన్నాం. అందుకే ప్రతికూలంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా నైపుణ్యాలను విశ్వసించి, మాకు మేం అండగా ఉండాలి’ అని పేర్కొన్నాడు.

ప్రత్యర్థి జట్టులో భారీ భాగస్వామ్యాలు నమోదవుతుంటే వాటిని విడదీయాల్సిన బాధ్యత బౌలర్ల మీదే ఉంటుందని షమి అన్నాడు. వికెట్లు తీసేందుకు, బ్యాట్స్‌మెన్‌ను బురిడీ కొట్టించేందుకు మనసులోనే వ్యూహాలు రచించాల్సి ఉంటుందన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 78 పరుగులకే కుప్పకూలగా ఇంగ్లాండ్‌ రెండో రోజు ఆట ముగిసే సరికి 423/8తో నిలిచింది. ఆ జట్టు కెప్టెన్‌ జోరూట్‌ (121) వరుసగా మూడో శతకం సాధించాడు. భారత్‌లో షమి (3/87), జడ్డూ (2/88), బుమ్రా (1/58), సిరాజ్‌ (2/86) వికెట్లు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని