IPL- CSK: ధోనీసేన మొదలెట్టేసింది.. దుబాయ్‌లో సందడే సందడి!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ ఆరంభానికి మరో నెల రోజులే ఉంది. దాంతో అప్పుడే సందడి మొదలైంది. వేదిక యూఈఏకి మారడంతో ఫ్రాంచైజీలన్నీ ముందుస్తుగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాయి. ...

Published : 14 Aug 2021 13:33 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ ఆరంభానికి మరో నెల రోజులే ఉంది. దాంతో అప్పుడే సందడి మొదలైంది. వేదిక యూఈఏకి మారడంతో ఫ్రాంచైజీలన్నీ ముందుస్తుగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాయి. మూడుసార్లు విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌ శుక్రవారం రాత్రే అక్కడికి చేరుకొంది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ ఓ వీడియోను ట్వీట్‌ చేసింది.

సారథి ఎంఎస్‌ ధోనీ, సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా, యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, రాబిన్‌ ఉతప్ప సహా ఇతర క్రికెటర్లు, సహాయ సిబ్బంది దుబాయ్‌కు చేరుకున్నారు. వారితో పాటు కుటుంబసభ్యులూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న సీఎస్‌కే ‘దుబాయ్‌కి మరోసారి వణక్కం’ అని ట్యాగ్‌ జత చేసింది. ఈ వీడియోలో సీఎస్‌కే బస చేస్తున్న హోటల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ గదిని చూపించారు.

సీఎస్‌కే సహాయ కోచ్‌లైన లక్ష్మీపతి బాలాజీ, మైక్‌ హస్సీ సహా ఇతర ఫ్రాంచైజీ ఆటగాళ్లకు వైరస్‌ సోకడంతో ఈ సీజన్‌ వాయిదాపడిన సంగతి తెలిసిందే. గతేడాది చిత్తుగా ఓడిపోయిన ధోనీసేన ఈ సారి మంచి ఫామ్‌లోనే కనిపించింది. ఐదు మ్యాచులు గెలిచి రెండింట్లోనే ఓడింది. పట్టికలో వారు రెండో స్థానంలో ఉన్నారు. మరో రెండు మ్యాచులు గెలిచారంటే వారు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయమే. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19న సీఎస్‌కే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయితో తలపడనుంది.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు