Virat Kohli: కోహ్లీ త్వరలోనే ఇంతకుముందులా రాణిస్తాడు: నాజర్

టీమ్‌ఇండియా దిగ్గజాలు సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌ కన్నా ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీనే అత్యంత ఉత్సాహభరితమైన క్రికెటర్‌ అని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు ముడాస్సర్‌...

Updated : 05 Nov 2021 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజాలు సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌ కన్నా ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీనే ఎంతో ధైర్యంగా ముందుకుసాగే క్రికెటర్‌ అని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు ముదస్సర్‌ నాజర్‌ ప్రశంసించాడు. కోహ్లీ త్వరలోనే ఇంతకుముందులా ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కొంతకాలంగా టీమ్‌ఇండియా సారథి అర్ధశతకాలు బాదుతున్నా వాటిని శతకాలుగా మల్చడంలో విఫలమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముదస్సర్‌ నాజర్‌ ఓ జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘సంవత్సరాల పాటు నిలకడగా పరుగులు చేయడమే కోహ్లీ, గావస్కర్‌ మధ్య ఉన్న ఒకే విధమైన పోలిక. అందువల్లే విరాట్‌ను చాలా మంది అభిమానిస్తారు. అయితే, కోహ్లీ కొద్ది రోజులుగా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఏళ్ల కొద్దీ ఆడే ఆటగాళ్లలో ఇలా జరగడం సహజమే. మనుషులుగా మనమూ కొన్నిసార్లు మానసికంగా సరిగ్గా ఉండలేం. అలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడే కోచ్‌ సహాయం అవసరం అవుతుంది. ఇప్పుడు విరాట్‌ కూడా చాలా ఏళ్లుగా నిరంతరాయంగా ఆడటం వల్ల ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇన్నాళ్లూ టీమ్‌ఇండియా, ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ వదులుకుంటుండటంతో త్వరలోనే పరుగులు చేసి రాణిస్తాడని అనుకుంటున్నా’ అని నాజర్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని