Neeraj chopra: బల్లెం వీరుడు నీరజ్‌ను ఏమైనా అడుగుతారా? సా. 4 గం.కు ఛాన్స్‌!

బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా కోలుకున్నాడు. తిరిగి అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యాడు....

Updated : 31 Aug 2021 22:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా కోలుకున్నాడు. తిరిగి అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యాడు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌ వేదికగా అందరితో మాట్లాడతానని వెల్లడించాడు. ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులను కలుసుకుంటానని ప్రకటించాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం ముద్దాడిన భారత రెండో అథ్లెట్‌గా నిలిచాడు. అంతేకాకుండా వందేళ్ల తర్వాత దేశానికి అథ్లెటిక్స్‌లో పతకం అందించాడు. విశ్వక్రీడల్లో ఈటెను ఎవరికీ అందనంత దూరం విసిరి స్వర్ణపతకం సాధించాడు.

టోక్యో నుంచి స్వదేశానికి వచ్చిన నీరజ్‌ చోప్రాకు భారతీయులు ఘన స్వాగతం పలికారు. అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. వరుసగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రముఖులను అతడు సందర్శించాడు. సన్మాన కార్యక్రమాలు, రహదారి షోల్లో పాల్గొన్నాడు. హఠాత్తుగా అతడికి జ్వరం రావడంతో ఓ రోడ్‌షో నుంచి మధ్యలోనే తప్పుకొని ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం కోలుకోవడంతో ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యాడు. వారు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని