Bhavinaben Patel: భావినా సంచలనం.. పారాలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరిక

టోక్యో పారాలింపిక్స్‌లో భారత ప్యాడ్లర్‌ భావినాబెన్‌ పటేల్‌ సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో ప్రి క్వార్టర్స్‌ చేరుకుంది. గ్రేట్‌ బ్రిటన్‌ అమ్మాయి మేగన్‌ షక్లెటన్‌తో జరిగిన టేబుల్‌ టెన్నిస్‌ మ్యాచులో 3-1 తేడాతో ఘన విజయం సాధించింది..

Updated : 26 Aug 2021 21:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో పారాలింపిక్స్‌లో భారత ప్యాడ్లర్‌ భావినాబెన్‌ పటేల్‌ సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో ప్రి క్వార్టర్స్‌ చేరుకుంది. గ్రేట్‌ బ్రిటన్‌ అమ్మాయి మేగన్‌ షక్లెటన్‌తో జరిగిన టేబుల్‌ టెన్నిస్‌ మ్యాచులో 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో ఆమె 11-7, 9-11, 17-15, 13-11 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.

భావినా బుధవారం జరిగిన తొలి రౌండు పోరులో పరాజయం చవిచూసింది. ఆమె పై పోరుకు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచు ఇది. దూకుడుగా ఆడి ఎనిమిది నిమిషాల్లోనే తొలి రౌండ్‌ గెలిచింది. అయితే ప్రత్యర్థి పుంజుకోవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత నువ్వా నేనా ప్రత్యర్థులిద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. చివరికి భావినా విజయం సాధించింది. మొత్తంగా రెండు మ్యాచుల్లో 3 పాయింట్లతో ఆమె ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.

‘మున్ముందు జరిగే మ్యాచుల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఈ రోజు నేను ఓపికగా ఆడాను. బంతిపైనే ఏకాగ్రత నిలిపాను. ప్రతికూల ఆలోచనలతో మ్యాచు వదులుకూడదని నిర్ణయించుకున్నా. కఠిన మ్యాచులో గెలిచినందుకు సంతోషంగా ఉంది. చెరో పాయింటు సాధిస్తూ వెళ్లినా పట్టు వదల్లేదు’ అని భావినా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని