IND vs NZ: రెండో టీ20ని వాయిదా వేయాలని ఝార్ఖండ్‌ హైకోర్టులో పిటిషన్

ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలని తాజాగా ఓ న్యాయవాది అక్కడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు...

Updated : 19 Nov 2021 10:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం రాత్రి రాంచీలోని ఝార్ఖండ్‌ స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానంలో రెండో టీ20 జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌ఇండియా దీనిని కూడా గెలుచుకొని సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలని తాజాగా ఓ న్యాయవాది అక్కడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో మ్యాచ్‌ను వాయిదా వేయాలని కోరిన ఆయన.. ఒకవేళ నిర్వహిస్తే 50శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని అభ్యర్థించారు.

కరోనా వైరస్‌ కారణంగా ఝార్ఖండ్‌లో ఆఫీసులు, గుళ్లు, కోర్టులు ఇలా జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో 50 శాతం మేరకే నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు సైతం రాష్ట్ర ప్రభుత్వం మొదట సగం మంది ప్రేక్షకులకే అనుమతులిచ్చింది. అయితే, ఉన్నట్టుండి ఇటీవల ఆ నిబంధనల్ని సడలిస్తూ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ధీరజ్‌ కుమార్‌ అనే అడ్వకేట్‌ మ్యాచ్‌ను వాయిదా వేయాలని లేదా 50 శాతం మేరకే ప్రేక్షకులను అనుమతించాలని తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు. మరి ఈ విషయంలో న్యాయస్థానం ఏమి చేయనుందో వేచిచూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని