PV sindhu: దిల్లీ చేరుకున్న పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగుపెట్టింది.

Updated : 03 Aug 2021 16:23 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగుపెట్టింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు  సింధుకు జాతీయ బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రతినిధులు, విమానాశ్రయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఎయిర్‌పోర్టుకు వెళ్లి సింధుకు స్వాగతం పలికారు. కాసేపట్లో ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీ, క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కలవనుంది.

టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం కైవసం చేసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని