Updated : 18/09/2021 11:00 IST

Anil Kumble as Head Coach: టీమ్‌ఇండియా కోచ్‌గా మళ్లీ అనిల్‌ కుంబ్లే?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్‌గా తప్పుకొంటున్నట్లు సారథి విరాట్‌ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ పొట్టి ప్రపంచకప్‌ తర్వాత హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి కాలపరిమితి కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఆ బాధ్యతల్లోకి మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లేను తీసుకువచ్చేలా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం.

‘గతంలో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా పనిచేసిన కుంబ్లే అర్ధాంతరంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ అంశంలో దిద్దుబాటు అవసరం. అప్పట్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒత్తిడి మేరకు క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ కుంబ్లేను తొలగించాల్సి వచ్చింది. అప్పుడలా జరగాల్సింది కాదు. అయితే, ఇప్పుడు టీమ్‌ఇండియా కోచ్‌గా పనిచేయాలా? వద్దా? అనేది కుంబ్లే, లక్ష్మణ్‌లపై ఆధారపడి ఉంది. అది వారి వ్యక్తిగత నిర్ణయం’ అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి పీటీఐతో అన్నారు.

కాగా, కుంబ్లే 2016-17 కాలంలో టీమ్‌ఇండియా కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో క్రికెట్‌ అడ్వైజరీ కమిటిలో సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్నారు. వాళ్లే కుంబ్లేను ఎంపిక చేశారు. అయితే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో విభేదాల కారణంగా 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం కుంబ్లే ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అనంతరం రవిశాస్త్రి ఆ బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ కొనసాగుతున్నాడు. నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ పూర్తయ్యేవరకు ఉంటాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కొత్త కోచ్‌ ఎంపిక కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆటగాళ్లుగా, మెంటార్లుగా మంచి అనుభవం కలిగిన కుంబ్లే, లక్ష్మణ్‌లు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని