Dhoni: ధోనీ అభిమానులకు శుభవార్త.. మరో మూడేళ్లు సీఎస్కేలోనే!

వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఈవెంట్‌ పది జట్లతో మరింత ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించి డిసెంబర్‌లో మెగా వేలం కూడా నిర్వహించనున్నారు...

Published : 25 Nov 2021 09:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఈవెంట్‌ పది జట్లతో మరింత ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించి డిసెంబర్‌లో మెగా వేలం కూడా నిర్వహించనున్నారు. అయితే, దానికంటే ముందు ఈనెల 30నాటికి  ప్రస్తుత జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించాలని ఆయా ఫ్రాంఛైజీలకు నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే చెన్నై తమ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని మరో మూడేళ్లు అట్టిపెట్టుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రుతురాజ్‌ గైక్వాడ్‌, రవీంద్ర జడేజాతో పాటు ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్లు మొయిన్‌ అలీ లేదా సామ్‌ కరన్‌.. ఇద్దరిలో ఒకరిని తమవద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం.

ఇక ముంబయి ఇండియన్స్‌ జట్టు కెప్టెన్ రోహిత్‌, పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాతో పాటు యువ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ లేదా సూర్యకుమార్‌లను అట్టిపెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు రోహిత్‌ లేని సమయాల్లో జట్టును నడింపించే కీరన్‌ పొలార్డ్‌ను సైతం ముంబయి తమ వద్దే ఉంచుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌.. రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, పృథ్వీ షాతో పాటు దక్షిణాఫ్రికా పేసర్‌ ఆన్‌రిచ్‌ నోర్జ్‌లపై దృష్టిసారించింది. కాగా, ఈ ఏడాది కొత్తగా చేరిన జట్లలో సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ లఖ్‌నవూ ఫ్రాంఛైజీని చేజిక్కించుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని