India vs Srilanka: ద్రవిడ్‌, గబ్బర్‌, భువీ గెలుపు విందు!

శ్రీలంకపై వన్డే సిరీసు విజయాన్ని టీమ్‌ఇండియా ఆస్వాదిస్తోంది. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, వైస్‌ కెప్టెన్ భువనేశ్వర్‌ కుమార్‌ ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నారు! బుధవారం రాత్రి వీరంతా కలిసి ప్రత్యేక స్థలంలో విందు ఆరగించారు. ...

Updated : 22 Jul 2021 12:30 IST

ప్రత్యేకంగా వేడుక చేసుకున్న టాప్‌-3

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకపై వన్డే సిరీసు విజయాన్ని టీమ్‌ఇండియా ఆస్వాదిస్తోంది. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, వైస్‌ కెప్టెన్ భువనేశ్వర్‌ కుమార్‌ ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నారు! బుధవారం రాత్రి వీరంతా కలిసి ప్రత్యేక స్థలంలో విందు ఆరగించారు. భువీతో పాటు అతడి సతీమణి నుపూర్‌ సైతం ఉండటం గమనార్హం. ‘అద్భుతమైన సహచరులతో అందమైన రాత్రి’ అంటూ గబ్బర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విందు విశేషాలు పంచుకున్నాడు. అంతా కలిసి తీసుకున్న చిత్రాన్ని పోస్ట్‌ చేశాడు.

తొలి వన్డేలో సునాయాస విజయం సాధించిన టీమ్‌ఇండియా రెండో వన్డేలో కష్టపడ్డ సంగతి తెలిసిందే. లంకేయులు నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని అత్యంత ఉత్కంఠకరంగా ఛేదించింది. తొలి వన్డేలో దూకుడుగా ఆడిన పృథ్వీ షా (13), శిఖర్‌ ధావన్‌(29), ఇషాన్‌ కిషన్‌ (1) 65 పరుగులకే పెవిలియన్‌ చేరారు.

ఈ క్రమంలో మనీశ్‌ పాండే (37), సూర్యకుమార్‌ యాదవ్‌ (53) కాస్త పోరాడారు. విజృంభించిన లంకేయులు వీరిద్దరితో పాటు హార్దిక్‌ను ఔట్‌ చేయడంలో భారత్‌ 160కే 6 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కృనాల్‌ పాండ్య (35), భువనేశ్వర్‌ కుమార్‌ (19*) అండతో దీపక్‌ చాహర్‌ (69*; 82 బంతుల్లో 7×4, 1×6) లక్ష్యం ఛేదించాడు. 2-0తో సిరీసు అందించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని