AFG vs NZ: భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ కన్నా ఈ మ్యాచ్‌నే ఎక్కువ మంది చూస్తారు!

టీ20 ప్రపంచకప్‌లో మరికాసేపట్లో ప్రారంభమయ్యే అఫ్గానిస్థాన్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారని, ఒక విధంగా చెప్పాలంటే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను చూసినవారికంటే అధికంగా...

Updated : 07 Nov 2021 15:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో మరికాసేపట్లో ప్రారంభమయ్యే అఫ్గానిస్థాన్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారని, ఒక విధంగా చెప్పాలంటే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కంటే ఎక్కువ మంది చూస్తారని టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో గావస్కర్‌ మాట్లాడాడు. భారత జట్టు సెమీస్‌ చేరే అవకాశాలు ఈ మ్యాచ్‌ ఫలితంపైనే ఆధారపడటంతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘టీమ్‌ఇండియా సెమీస్‌  చేరాలంటే ఇది కీలకమైన మ్యాచ్‌ అని అందరికీ తెలిసిందే. దీన్ని కోట్లాది మంది వీక్షిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ కన్నా అధికంగా వీక్షిస్తారు. అటు అఫ్గాన్‌ ప్రజలతోపాటు.. ఇక్కడి ప్రజలు కూడా చూస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రపంచకప్‌ టోర్నీలో ఈ మ్యాచ్‌నే అత్యధిక మంది చూసి ఆనందించినా నేను ఆశ్చర్యపోను’ అని గావస్కర్‌ వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, అఫ్గాన్‌లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని మాజీ సారథి పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని