Published : 22/08/2021 01:03 IST

INDvsENG: లార్డ్స్‌లో శతకం కొట్టడం ఒక్కటే ముఖ్యం కాదు: సన్నీ

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ పుట్టినిల్లు అయిన లార్డ్స్‌ మైదానంలో శతకం బాదినంత మాత్రాన అంతా సాధించినట్లు కాదని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌ విదేశాల్లో ఎక్కడ సెంచరీ బాదినా అది ప్రత్యేకమేనని పేర్కొన్నాడు. తాజాగా రెండో టెస్టులో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేయడంపై స్పందిస్తూ సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన మాజీ సారథి రోహిత్‌ బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ అద్భుతమైన మానసిక స్థైర్యంతో బ్యాటింగ్‌ చేశాడని కొనియాడాడు.

‘ఒక టెస్టు మ్యాచ్‌లో పిచ్‌ ఎలా స్పందిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. పిచ్‌లో జీవం ఉందా లేదా అనేది తెలియదు. బంతి బౌన్స్‌ అవుతుందా లేదా అనేది అర్థంకాదు. ఇవన్నీ తెలియాలంటే కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలోనే రోహిత్‌ తన ఆటను అద్భుతంగా మలుచుకున్నాడు. ఎలాంటి షాట్లు ఆడాలి. ఎలాంటి బంతులు వేయాలనే విషయాలపై కచ్చితమైన అవగాహనతో ఉన్నాడు. అదంతా మానసికంగా దృఢంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయంలో టీమ్ఇండియా ఓపెనర్‌ మంచి పనిచేశాడు. ఒక బ్యాట్స్‌మన్‌ ఒక మ్యాచ్‌లో 80 పరుగులు చేశాడంటే సిరీస్‌ మొత్తం 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఒక ఆటగాడి నుంచి కెప్టెన్‌ ఇంతకన్నా ఏం ఆశించగలడు? ఇక సెంచరీ కోల్పోవడం అనేది రోహిత్‌ బాధపడి ఉండొచ్చు. కానీ, లార్డ్స్‌లో శతకం సాధించినంత మాత్రాన అంతా జయించినట్టు కాదు, అదొక్కటే ముఖ్యం కాదు’ అని గావస్కర్‌ విశ్లేషించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని