Team India: అశ్విన్‌ను తీసుకోకపోవడంపై విచారణ జరపాలి

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎందుకు ఆడించడం లేదని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించారు...

Updated : 16 Nov 2021 15:20 IST

తుదిజట్టులో ఆడకపోతే.. ఎంపిక చేయడం ఎందుకు?: వెంగ్‌సర్కార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎందుకు ఆడించడం లేదని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని కివీస్‌తో మ్యాచ్‌లోనూ ఆడించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా అతడు నిరూపించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సీనియర్‌ స్పిన్నర్‌ను కాదని అతడిని ఎందుకు తీసుకున్నారని వెంగ్‌సర్కార్‌ అసహనం వ్యక్తం చేశారు.

‘అశ్విన్‌ను చాలా రోజుల నుంచి ఎందుకు పక్కనపెడుతున్నారు? ఈ విషయంపై విచారణ జరపాలి. ఫార్మాట్లకు అతీతంగా అత్యుత్తమ స్పిన్నర్‌గా అతడు రాణిస్తున్నాడు. అలాగే తన ఖాతాలో 600కు పైగా అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. జట్టులో అత్యంత అనుభవం ఉన్న స్పిన్నర్‌ అతడే. అలాంటిది అతడిని ఎందుకు తీసుకోవడం లేదు? ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్‌లో ఆడించలేదు. ఇది నాకస్సలు అర్థంకావడం లేదు. అతడిని ఆడించనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? ఇది పెద్ద మిస్టరీలా ఉంది. అలాగే రెండు మ్యాచ్‌ల్లోనూ ఆటగాళ్లంతా నిస్సారంగా కనిపించారు. బయోబబుల్‌ వల్ల అలా కనిపించారో ఏమో నాకు తెలియదు కానీ, చాలా కాలంగా ఆటగాళ్లలో ఇలాంటి బాడీలాంగ్వేజ్‌ చూడలేదు’ అని వెంగ్‌సర్కార్‌ ఓ మీడియాతో చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు