T20 World Cup: కీలకపోరులో చేతులెత్తేసిన భారత బ్యాటర్లు
టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో కీలకమైన పోరులో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో కీలకమైన పోరులో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్‌తో ఓపెనింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ (ఎనిమిది బంతుల్లో 4 పరుగులు) దారుణంగా విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్ (14)తో కలిసి కేఎల్ రాహుల్ (18) కాస్త కుదురుకున్నట్లే కనిపించాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరితోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) పెవిలియన్‌కు చేరారు. టాప్-ఆర్డర్ బ్యాటర్లు నలుగురూ బౌండరీలైన్ వద్దే క్యాచ్ ఔట్ కావడం గమనార్హం. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్య (23)తో కలిసి రిషభ్ పంత్ (12) టీమ్ఇండియా ఇన్నింగ్స్‌ను ఆదుకుంటాడేమోనని భావించినా.. మరోసారి సగటు అభిమానికి నిరాశే ఎదురైంది. కివీస్ బౌలర్ మిల్నే బౌలింగ్‌లో పంత్ క్లీన్‌బౌల్డయ్యాడు. అప్పటికి భారత్ 15 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. అయితే, చివర్లో జడేజా (26*) కాస్త బ్యాట్‌ను ఝళిపించడంతో భారత్ ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 3, సోధి 2, సౌథీ, మిల్నే తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్‌గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!