Team India: అశ్విన్‌ తిరిగి రావడమే పెద్ద విషయం: కోహ్లీ

సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తిరిగి జట్టులోకి రావడమే టీమ్‌ఇండియాకు పెద్ద సానుకూల విషయమని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ...

Published : 04 Nov 2021 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తిరిగి జట్టులోకి రావడమే టీమ్‌ఇండియాకు పెద్ద సానుకూల విషయమని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ 2/14 మెరుగైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. బంతిని తిప్పుతూ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అఫ్గాన్‌ భారీ లక్ష్య ఛేదనలో 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

‘టీమ్ఇండియాలోకి అశ్విన్‌ తిరిగి రావడం పెద్ద సానుకూల విషయం. ఇందుకోసమే అతడు తీవ్రంగా కష్టపడ్డాడు. ఐపీఎల్‌లోనూ ఇలాంటి పట్టుదల, కసి కనబరిచాడు. అతడు వికెట్‌ టేకర్‌ మాత్రమే కాదు.. తెలివిగల బౌలర్‌ కూడా’ అని విరాట్‌ చెప్పుకొచ్చాడు. ఇక షార్జా పిచ్‌పై స్పందిస్తూ.. గత రెండు మ్యాచ్‌లు జరిగిన పిచ్‌ల కన్నా ఇదెంతో బాగుందన్నాడు. టీ20 క్రికెట్‌ ఎప్పుడు ఎలా సాగుతుందో తెలియదని, అలాంటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేమని తెలిపాడు. టాప్‌ఆర్డర్‌ బాగా ఆడితే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నాడు. ఇక టీమ్‌ఇండియా సెమీస్‌కు వెళ్లే విషయంపై మాట్లాడుతూ.. తమకింకా చిన్న అవకాశం ఉందని, అందుకోసం సానుకూలంగా దృక్పథంతో ఉన్నామని చెప్పాడు. అంతకుముందు పాక్‌, న్యూజిలాండ్‌ జట్లతో తలపడిన సందర్భంగా ఆయా బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారని, దాంతో తమని పరుగులు చేయకుండా కట్టడి చేశారని కోహ్లీ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని