Virat on Dravid: ద్రవిడ్‌ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు: కోహ్లీ

టీమ్ఇండియా నూతన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపిక దాదాపు ఖరారైంది. ఈరోజు నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుతం ఉన్న రవిశాస్త్రి హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు...

Published : 17 Oct 2021 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్ఇండియా నూతన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపిక దాదాపు ఖరారైంది. ఈరోజు నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుతం ఉన్న రవిశాస్త్రి హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఈ ప్రపంచకప్‌తో అతడి కాంట్రాక్ట్‌ ముగిసిపోనుంది. ద్రవిడ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అతడికి ఆసక్తి లేకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జైషా ప్రత్యేకంగా సమావేశమై ఒప్పించారని తెలిసింది. ఇదే విషయంపై మీడియా కోహ్లీని వివరణ అడగ్గా.. ద్రవిడ్‌ కోచ్‌ అవుతున్నాడన్న విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియట్లేదని, ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదని బదులిచ్చాడు.

కాగా, టీమ్‌ఇండియా తర్వాతి కోచ్‌గా ఇదివరకు మాజీ కోచ్‌, కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే పేరు వినిపించినా ఇప్పుడు అనూహ్యంగా ద్రవిడ్‌ పేరు తెరపైకి రావడం విశేషం. చాలా కాలంగా ఈ మిస్టర్‌ డిపెండబుల్‌.. అండర్‌-19, ఇండియా-ఏ జట్లకు కోచ్‌గా చేసిన అనుభవంతో పాటు ఎన్‌సీఏ హెడ్‌గానూ సేవలందిస్తున్నాడు. దీంతో ప్రస్తుత జట్టులోని చాలా మంది యువక్రికెటర్లకు ద్రవిడ్‌తో మంచి అనుబంధం ఉంది. అతడి శిక్షణలోనే పృథ్వీషా, రిషభ్‌ పంత్‌, అవేశ్‌ ఖాన్‌, హనుమ విహారి, శుభ్‌మన్‌గిల్‌ లాంటి యువ క్రికెటర్లు మేటి ఆటగాళ్లుగా తయారయ్యారు. మరోవైపు రాబోయే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలోనూ ద్రవిడే టీమ్‌ఇండియాకు సరైన కోచ్‌ అని అభిమానులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని