Rohit Sharma Century: మెరిసిన రోహిత్‌.. విదేశీ గడ్డపై టెస్టుల్లో తొలి శతకం

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(103*) శతకం సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సిక్సర్‌తో మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు...

Updated : 04 Sep 2021 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(103*) శతకం సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సిక్సర్‌తో మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై తొలి శతకం సాధించడమే కాకుండా ఓవరాల్‌గా 8వ సెంచరీ బాదాడు. కేఎల్‌ రాహుల్‌(46)తో కలిసి శనివారం మూడో రోజు ఆట ప్రారంభించిన హిట్‌మ్యాన్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. తొలి సెషన్‌లో రాహుల్‌ ఔటైనా.. పుజారా(48*)తో కలిసి సాధికార ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు 204 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో సెంచరీ సాధించడంతో పాటు టెస్టుల్లో 3 వేల పరుగుల మైలురాయి కూడా చేరుకున్నాడు. మొయిన్‌ అలీ వేసిన 63.5 ఓవర్‌కు బంతిని సిక్సర్‌గా మలిచి ఈ రెండు రికార్డులు నమోదుచేశాడు. ప్రస్తుతం పుజారాతో శతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నాడు. ఇక రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి టీమ్‌ఇండియా స్కోర్‌ 199/1గా నమోదు కాగా ఆధిక్యం 100 పరుగులకు చేరింది. మరోవైపు హిట్‌మ్యాన్‌ సెంచరీ పూర్తి చేయగానే టీమ్‌ఇండియా బాల్కానీ చప్పట్లతో మార్మోగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ సతీమణి రితిక సంతోషంలో మునిగిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని