Published : 06/08/2021 01:50 IST

INDvsENG: అనిల్‌కుంబ్లే రికార్డు సమం చేసిన అండర్సన్‌ @ 619

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమ్‌ఇండియా లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌కుంబ్లే సరసన చేరాడు. టెస్టుల్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇదే వరుసలో కుంబ్లే 619 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఆ రికార్డును అండర్సన్‌ ఇప్పుడు అందుకున్నాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు అతడు ఒకే ఓవర్‌లో చెతేశ్వర్‌ పుజారా (4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(0)ను పెవిలియన్‌ చేర్చడంతో ఈ కీలక మైలురాయిని చేరుకున్నాడు. 41వ ఓవర్‌లో అతడు వరుస బంతుల్లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టించాడు. కాగా, 2003లో అరంగేట్రం చేసిన అండర్సన్‌.. నాటి నుంచి విజయవంతమైన పేసర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు 163వ టెస్టులో కుంబ్లే రికార్డును చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మరో వికెట్‌ తీస్తే అతడు జంబోను అధిగమించి కొత్త రికార్డు సృష్టిస్తాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని