PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు అభినందనల వెల్లువ

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు పట్ల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, చంద్రబాబుతో సహా మరికొందరు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు....

Published : 02 Aug 2021 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, ప్రముఖ సినీనటులు చిరంజీవి, మహేశ్‌ బాబుతో సహా మరికొందరు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కీలకమైన పోరులో సింధు అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ పతకం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు సింధు రికార్డు విజయం పట్ల ఆమె తండ్రి రమణ మీడియాతో ముచ్చటించారు. తన కూతుర్ని ప్రోత్సహించి ఇంతటి ఘన విజయాన్ని సాధించేందుకు దోహదపడిన భారత ప్రభుత్వం, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, మీడియాకు రమణ కృతజ్ఞతలు తెలిపారు.

‘‘సెమీ ఫైనల్‌లో ఓటమి తర్వాత సింధుపై మరింత ఒత్తిడి పెరిగింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నా కూతురు ఒత్తిడిని తట్టుకొని దేశానికి పతకం సాధించింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన నా కుమార్తె పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడెంతో సంతోషంగా ఉంది’’ రమణ వివరించారు.












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని