Published : 31/08/2021 01:39 IST

CSK Training: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్రైనింగ్‌ సెషన్‌ ఎలా ఉందో చూడండి

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ 14వ సీజన్‌ మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని జట్లూ ఇప్పటికే యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్‌ మొదలుపెట్టాయి. అందులో అన్నిటికన్నా ముందు వెళ్లింది చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు. ధోనీ సారథ్యంలో గతేడాది సరైన ప్రదర్శన చేయలేకపోయిన సీఎస్కే.. కరోనా కారణంగా టోర్నీ అర్ధాంతరంగా నిలిచిపోయేసరికి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక మిగిలిన సీజన్‌లోనూ ఇలాంటి మంచి ప్రదర్శనే చేసి నాలుగోసారి కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లందర్నీ సమాయత్తం చేస్తోంది. ఈ క్రమంలోనే కెప్టెన్‌ ధోనీ, వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనాతో సహా యువ ఆటగాళ్లందరితో మైదానంలో ప్రాక్టీస్‌ మొదలెట్టింది. ఆ వీడియోను తాజాగా యూట్యూబ్‌లో అభిమానులతో పంచుకుంది. మరి సీఎస్కే ఆటగాళ్ల వార్మప్‌ విశేషాలు ఎలా ఉన్నాయో మీరూ ఓ లుక్కేయండి...


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని