US Open: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఎమ్మా
ఇంగ్లాండ్ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది...
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. తాజాగా 17వ సీడ్ గ్రీస్ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో సెమీఫైనల్స్‌లో గెలిచిన ఎమ్మా ఈ ఘనత సాధించింది. దీంతో 17 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన పిన్న వయస్కురాలిగానూ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ప్రముఖ క్రీడాకారిణి మారియా షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్ టైటిల్ గెలవడం గమనార్హం.
ప్రస్తుతం 150వ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా.. ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి లెయ్లా ఫెర్నాండెజ్(19)తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ఆమె ఈ మ్యాచ్‌లో మారియాను ఓడించిన వీడియోను యూఎస్ ఓపెన్ టెన్నిస్ ట్విటర్లో పంచుకుంది. అందులో ఈ బ్రిటన్ చిన్నది సాధించిన విజయాన్ని తనను తానే నమ్మలేకపోయింది. చివరిపాయింట్ సాధించాక కాసేపు తలను పట్టుకొని అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసింది. తాను ఫైనల్‌కు చేరానంటే నమ్మలేకపోతున్నానని చెప్పింది. తనపై ఒత్తిడి లేదని, తుదిపోరులో మంచి ప్రదర్శన చేస్తానని తెలిపింది. మరోవైపు రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరు టీనేజీ క్రీడాకారులు మహిళల గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో పోటీపడనుండటం విశేషం. 1999లో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్ మార్టినా హింగిస్ అనే 18 ఏళ్ల క్రీడాకారిణితో పోటీపడి ఓడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్‌ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్‌కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్‌ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్‌లో 12.5, రెండో వాల్ట్‌లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్‌లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్‌ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్‌నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్‌కౌంటర్‌పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్