INDvsENG: బుమ్రాతో అనవసరంగా పెట్టుకున్నామని ఇంగ్లాండ్ భావించొచ్చు: జహీర్
భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు జస్ప్రిత్ బుమ్రాతో అనవసరంగా పెట్టుకున్నామని పశ్చాత్తాపం చెంది ఉంటుందని మాజీ పేసర్ జహీర్‌ఖాన్ అభిప్రాయపడ్డాడు...
ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు జస్ప్రిత్ బుమ్రాతో అనవసరంగా పెట్టుకున్నామని పశ్చాత్తాపం చెంది ఉంటుందని మాజీ పేసర్ జహీర్‌ఖాన్ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు కోపమొస్తే ఇలాంటి ప్రదర్శనే చేస్తాడని అన్నాడు. అతడు ప్రపంచశ్రేణి బౌలర్ అయినా, తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయలేదని, అలాంటిది అండర్సన్‌తో వివాదం జరిగాక రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడని జహీర్ గుర్తుచేశాడు.
కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు అండర్సన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బుమ్రా పలు షార్ట్‌పిచ్ బంతులేసి ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లిష్ పేసర్ అతడితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దాని పర్యావసానం నాలుగు, ఐదు రోజులపైనా పడింది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు బుమ్రా(34), షమి(56) ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అప్పుడు కూడా మార్క్‌వుడ్ నోటికి పనిచెప్పాడు. అలా ఇంగ్లాండ్ ఆటగాళ్లు పలు సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు దిగిన వేళ బుమ్రా బంతితో మెరిశాడు. మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా తన కోపాన్ని సరైన ఆటతీరుతో చూపించాడని జహీర్ పేర్కొన్నాడు. అంతకుముందు ఎదురైన అనుభవాలన్నీ అతడికి కసిని పెంచాయని చెప్పాడు. దాంతో బౌలింగ్‌లోనూ తన చాతుర్యం ప్రదర్శించి వికెట్లు తీసాడన్నాడు. చివరికి బుమ్రా ఆతిథ్య జట్టు ఓటమికి ప్రధాన కారణం అవడంతో ఇప్పుడా జట్టు పశ్చాత్తాపం చెంది ఉంటుందని మాజీ పేసర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్ పొట్టి లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్‌గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్‌ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్