Tokyo Olympics: ఎండల ఎఫెక్ట్‌.. టెన్నిస్‌ మ్యాచ్‌ల సమయంలో మార్పులు

టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్‌ మ్యాచ్‌ల సమయాన్ని ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ మార్చింది. ఇకపై మధ్యాహ్నం మూడు గంటల నుంచి మ్యాచ్‌లు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మధ్యాహ్నం సమయంలో ఎండ ఎక్కువగా ఉండటంతో టెన్నిస్‌ క్రీడాకారులు వేడిని తట్టుకోలేపోతున్నారట. బుధవారం జరిగిన ఓ మ్యాచ్‌లో ప్రపంచ

Published : 29 Jul 2021 01:54 IST

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్‌ మ్యాచ్‌ల సమయాన్ని ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ మార్చింది. ఇకపై మధ్యాహ్నం మూడు గంటల నుంచి మ్యాచ్‌లు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మధ్యాహ్నం సమయంలో ఎండ ఎక్కువగా ఉండటంతో టెన్నిస్‌ క్రీడాకారులు వేడిని తట్టుకోలేపోతున్నారట. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్‌లో 2 స్థానంలోఉన్న డానిల్‌ మెద్వదేవ్‌ టెన్నిస్‌ ఆడుతూ వడదెబ్బకు గురయ్యారు. దీంతో ‘‘నేను మ్యాచ్‌ను పూర్తి చేస్తాను కానీ, నేను చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు’’అని ఎంపైర్‌ను ప్రశ్నిస్తూ తన అసహనం వ్యక్తం చేశాడు.

ఉదయం 11 గంటలకు టెన్నిస్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతుండటంతో వేడి పెరుగుతోంది. దీంతో క్రీడాకారులు వడదెబ్బకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు క్రీడాకారులు మ్యాచ్‌లను మధ్యాహ్నం తర్వాత ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో క్రీడాకారుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, టోక్యోలో పెరుగుతున్న ఎండ తీవ్రత కారణంగా మ్యాచ్‌ల సమయంలో మార్పులు చేస్తున్నామని ఐటీఎఫ్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని