Tokyo Olympics: ఒలింపిక్స్‌ క్రీడాకారుల బృందానికి రాష్ట్రపతి తేనీటి విందు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ నెల 14న ఏర్పాటు చేసిన తేనీటి విందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆహ్వానించారు.

Published : 10 Aug 2021 23:46 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ నెల 14న ఏర్పాటు చేసిన తేనీటి విందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆహ్వానించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం వెల్లడించింది.  స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మరుసటి రోజు దిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించే కార్యక్రమానికి ఆ క్రీడాకారులంతా హాజరు కానున్నారు. ఆక్కడ ప్రధాని నరేంద్ర మోదీ వారిని కలిసి ముచ్చటించనున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు భారత్‌ ఖాతాలో నమోదయ్యాయి. జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా.. అథ్లెటిక్స్‌ చరిత్రలోనే దేశానికి తొలి పసిడి పతకం సాధించిపెట్టాడు. వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను, రెజ్లర్‌ రవికుమార్‌ దహియా రజత పతకాలను సాధించారు. పురుషుల హాకీ జట్టు, షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌, రెజ్లర్‌ భజరంగ్‌ పునియాలు కాంస్య పతకాలతో మెరిశారు. అంతకుముందు 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో అభినవ్‌ బింద్రా వ్యక్తిగతంగా పసిడి పతకం సాధించాడు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని