Brett Lee: భారత్‌, ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్లలో వారిద్దరూ లేకపోవడమా?: బ్రెట్‌లీ

కీలక ఆటగాళ్లను భారత్‌, ఆస్ట్రేలియాలు పక్కన పెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బ్రెట్‌లీ తెలిపాడు. 

Published : 07 Oct 2022 01:27 IST

దిల్లీ:  ఆస్ట్రేలియా పాతతరం ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడైన బ్రెట్‌లీ టీ20 ప్రపంచకప్‌ జట్ల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలక ఆటగాళ్లను భారత్‌, ఆస్ట్రేలియాలు పక్కన పెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని  తెలిపాడు. 

‘‘ఉమ్రాన్‌ మాలిక్‌ను భారత జట్టు ఎంపిక చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ సిరీస్‌లో అతడు ఆడితే చూడాలనుకున్నాను. అతడు కచ్చితంగా ఈ టోర్నీ ఆడాల్సినవాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో కామెరూన్‌ గ్రీన్‌కు ఎందుకు చోటుదక్కలేదో నాకు అర్థం కావడం లేదు’’ అని ఈ లెజండరీ మాజీ ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా పిచ్‌ల గురించి మాట్లాడుతూ.. ఆటలో పేస్‌, బౌన్స్‌ రెండూ కీలకమే. వాటిని ఎంత సమర్థంగా వినియోగించుకుంటామనేది ఆటగాడి మీదనే ఆధారపడి ఉంటుందని తెలిపాడు. అయితే ఆసియా ఖండం నుంచి వచ్చే బ్యాట్స్‌మెన్‌లకు అదనపు బౌన్స్‌ ఉన్న పిచ్‌లపై ఆడిన అనుభవం తక్కువగా ఉంటుందని గుర్తుచేశాడు. 

2022లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఉమ్రాన్‌.. టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పేరుతెచ్చుకున్నాడు. టీమ్‌ఇండియాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌ల మ్యాచ్‌లో వార్నర్‌కు బదులుగా ఓపెనర్‌గా వచ్చిన గ్రీన్‌.. తొలి మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. పేస్‌ బౌలింగ్‌, చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న ఇతడిని ప్రపంచజట్టులో ఉంచాలన్న డిమాండ్లు వినిపించాయి. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని