Virat Kohli: బట్లర్‌తో ఏం మాట్లాడాడో బయటపెట్టిన విరాట్

ఇటీవల రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ తనవద్దకు వచ్చి ఏదో మాట్లాడిన విషయాన్ని బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ బయటపెట్టాడు...

Published : 22 May 2022 01:52 IST

(Photo: Jos Buttler Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ తనవద్దకు వచ్చి ఏదో మాట్లాడిన విషయాన్ని బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ బయటపెట్టాడు. ఈ సీజన్‌లో ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ గురువారం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌పై 73 పరుగులు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ఫామ్‌ అందుకొని మునుపటి ఆటగాడిలా కనిపించాడు. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌తో ముచ్చటించాడు.

‘ఇటీవల ఓ మ్యాచ్‌ సందర్భంగా బట్లర్‌ నావద్దకు వచ్చి నన్ను ఏదో అడగాలని అన్నాడు. దాంతో నేను స్పందిస్తూ.. నువ్వు ఇప్పటికే ఈ టోర్నీలో మేటి బ్యాట్స్‌మన్‌గా అగ్రస్థానంలో దూసుకుపోతున్నావ్‌. నేనసలే పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్నా. అలాంటిది నువ్వు నన్నేం అడగాలనుకుంటున్నావ్‌? అని బదులిచ్చాను. దానికి ఇద్దరం కాసేపు సరదాగా నవ్వుకొని మాట్లాడుకున్నాం’ అని విరాట్‌ వివరించాడు. కాగా, ఈ సీజన్‌లో కోహ్లీ గుజరాత్‌తో మ్యాచ్‌ ముందువరకు 13 మ్యాచ్‌లు ఆడి ఒకే అర్ధశతకంతో 236 పరుగులు చేశాడు. సగటు 20 కన్నా తక్కువే నమోదైంది. ఇక గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాట్‌తో చెలరేగి రెండో అర్ధ శతకం సాధించాడు. దీంతో లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి మొత్తం 309 పరుగులు చేశాడు. సగటు 23.77గా మారి కాస్త మెరుగైంది. ఇక బట్లర్‌ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 629 పరుగులు చేయగా సగటు 48.38గా నమోదైంది. దీంతో అత్యధిక పరుగుల వీరుడిగా టాప్‌లో కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు