తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్‌

గాయపడ్డ టీమ్‌ఇండియా చేతుల్లో ఓటమి పాలవ్వడం పూడ్చలేని లోటు మిగిల్చిందని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ అన్నాడు. కెప్టెన్‌ టిమ్‌పైన్‌, బౌలర్ల వ్యూహాలను ప్రశ్నించక తప్పదన్నాడు. రాబోయే రోజుల్లో కొందరిపై వేటు తప్పదని అంచనా వేశాడు. పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగిన కంగారూలు తక్కువ...

Published : 20 Jan 2021 22:00 IST

బ్రిస్బేన్‌: గాయపడ్డ టీమ్‌ఇండియా చేతుల్లో ఓటమి పాలవ్వడం పూడ్చలేని లోటు మిగిల్చిందని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ అన్నాడు. కెప్టెన్‌ టిమ్‌పైన్‌, బౌలర్ల వ్యూహాలను ప్రశ్నించక తప్పదన్నాడు. రాబోయే రోజుల్లో కొందరిపై వేటు తప్పదని అంచనా వేశాడు. పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగిన కంగారూలు తక్కువ బలమున్న రహానె సేన చేతిలో ఓటమిపాలవ్వడం కలిచివేసిందన్నాడు.

‘ఈ ఓటమి పూడ్చలేని లోటును మిగిల్చింది. రెండో, మూడో స్థాయి జట్టుతో ఎక్కువసార్లు ఓడిపోకూడదు. ఆస్ట్రేలియా వ్యూహాలు, జట్టును ప్రశ్నించక తప్పదు. బౌలర్లను కచ్చితంగా ప్రశ్నించాలి. జట్టులో కొందరు ఆటగాళ్ల చోటూ ప్రశ్నార్థకమే. అలా తప్పక చేయాల్సిందే. భారత్‌ అద్భుతంగా ఆడిందని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు’ అని షేన్‌వార్న్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సీనియర్లు గాయపడ్డా రిజర్వుబెంచీ ఆటగాళ్లతో సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియాపై వార్న్‌ ప్రశంసలు కురిపించాడు. ‘కోల్పోయేందుకు ఏమీ లేని భారత్‌ పట్టుదలగా ఆడింది. కానీ తొలి ప్రాధాన్యం ఉన్న ఆటగాళ్లు ముగ్గురు, నలుగురే ఆడారు. కుర్రాళ్లు కసిని ప్రదర్శించారు’ అని పేర్కొన్నాడు. గబ్బా టెస్టులో వచ్చిన అవకాశాల్ని ఆసీస్‌ ఒడిసిపట్టలేదని వార్న్‌ అన్నాడు.

‘అవును, అవకాశాలు వచ్చాయి. టీమ్‌ఇండియాను చిత్తు చేసేందుకు ఆసీస్‌కు ఎన్నో అవకాశాలు లభించాయి. కానీ వారు అందిపుచ్చుకోలేదు. టిమ్‌పైన్‌ వ్యూహాలు బాగాలేవు. అతనొక్కడినే నిందించేందుకు వీల్లేదు. బౌలర్లు, కెప్టెన్‌ ఉమ్మడిగా బాధ్యులు. ఏదేమైనా సారథిగా పైన్‌ అన్నింటికీ బాధ్యత వహించాలి. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు’ అని షేన్‌వార్న్‌ తెలిపాడు.

ఇవీ చదవండి
ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని