MS Dhoni: ధోనీ చెబుతున్న జీవిత పాఠం.. వైరల్‌గా మారిన ‘లెస్సన్‌ 7’ యాడ్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తాజాగా ఆన్‌లైన్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ సంస్థ ‘అన్‌అకాడెమీ’ యాడ్‌ ఫిల్మ్‌లో మెరిశారు. ఇందులో గొప్పేం.. ఇంతకుముందూ అనేక ప్రకటనలు చేశారు కదా అనుకోవచ్చు! కానీ.. దీనికో ప్రత్యేకత ఉంది. ఈ ప్రకటనను...

Published : 25 Jan 2022 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తాజాగా ఆన్‌లైన్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ సంస్థ ‘అన్‌అకాడమీ’ యాడ్‌ ఫిల్మ్‌లో మెరిశారు. ఇందులో గొప్పేం ఉంది.. ఇంతకుముందూ అనేక ప్రకటనలు చేశారు కదా అనుకోవచ్చు! కానీ.. దీనికో ప్రత్యేకత ఉంది. ఈ ప్రకటనను రూపొందించేందుకు దాదాపు ఏడాది పట్టడం గమనార్హం. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ.. ‘లెస్సన్‌ 7’ పేరిట రూపొందించిన ఈ స్ఫూర్తిదాయక ప్రకటనను సోమవారం విడుదల చేసింది.

వెనుక రైలు వస్తుండగా.. ధోనీ  పట్టాలపై పరిగెత్తుతూ ఎదుట వస్తున్న అడ్డంకులను దాటుకుంటూ చివరకు తన లక్ష్యాన్ని అందుకుంటున్నట్లు ఇందులో చూపించారు. ‘లక్ష్యంపై చూపు.. అడ్డంకులను ఛేదించాలనే సంకల్పం.. ఛాంపియన్‌ని చేస్తుంది! ఈ అంతర్జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా.. కష్ట సమయాల్లో ‘లెస్సన్‌ 7’ను గుర్తుచేసుకోండి’ అంటూ సంస్థ ఈ యాడ్‌ను ట్వీట్‌ చేసింది. ‘మాకు సంబంధించిన వాటిలో ఇప్పటివరకు అత్యంత ప్రతిష్ఠాత్మక, ఐకానిక్ యాడ్‌ ఇది. దీన్ని రూపొందించేందుకు దాదాపు ఏడాది పట్టింది’ అని సంస్థ సీఈఓ గౌరవ్‌ ముంజల్‌ వెల్లడించారు.

ధోనీ స్టైలిష్ లుక్స్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ ప్రకటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ట్విటర్‌లో దాదాపు 15 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ యాడ్‌ను పోస్ట్‌ చేస్తూ.. హెలికాప్టర్‌ షాట్‌లాగే ఇది కూడా అద్భుతంగా ఉందంటూ ధోనీకి కితాబిచ్చారు. ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే, సినీ నటి సమంత తదితరులూ దీన్ని ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని