Ishant Sharma Birthday: మిమిక్రీతో నవ్వులు పూయించిన యువరాజ్‌ సింగ్‌

టీమ్ఇండియా ‘లంబు’ మ్యాన్‌, ఫాస్ట్‌బౌలర్‌ ఇషాంత్‌ శర్మ గురువారం తన 33వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. దీంతో అతనికి పలువురు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సైతం లంబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో విశేషం ఏముంది

Published : 03 Sep 2021 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ ఇషాంత్‌ శర్మ గురువారం తన 33వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. దీంతో అతడికి పలువురు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సైతం లంబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇషాంత్‌ శర్మ వాయిస్‌ని మిమిక్రీ చేసిన వీడియోని యువరాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘జన్మదిన శుభాకాంక్షలు.  ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు ఈ సిరీస్ (ఇంగ్లాండ్‌-భారత్‌) టెస్టు సిరీస్‌లో గొప్పగా రాణిస్తారని ఆశిస్తున్నా’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఇషాంత్‌ శర్మకు బీసీసీఐ, ఐసీసీ, దిల్లీ క్యాపిటల్స్‌, భారత క్రికెటర్లు వృద్ధీమాన్‌ సాహా, దినేశ్ కార్తీక్‌ ట్విటర్‌ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, ఓవల్ వేదికగా ఇంగ్లాడ్-భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇషాంత్ శర్మకు తుదిజట్టులో చోటు దక్కలేదు.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని