PengShuai: ఆస్ట్రేలియా ఓపెన్లోపెంగ్ షువాయి టీ షర్ట్‌లకు అనుమతి
చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి అదృశ్యం సెగ ఆస్ట్రేలియా ఓపెన్‌ను తాకింది. ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆమెకు మద్దతు తెలిపే టీ షర్ట్ల వాడకంపై విధించిన నిషేధంపై ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
మెల్బోర్న్: చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి అదృశ్యం సెగ ఆస్ట్రేలియా ఓపెన్‌ను తాకింది. ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆమెకు మద్దతు తెలిపే టీ షర్ట్ల వాడకంపై విధించిన నిషేధంపై ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. టెన్నిస్ దిగ్గజాలు, అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ‘పెంగ్ షువాయి ఎక్కడ ఉంది?’ అని రాసి ఉంచిన చొక్కాలు ధరించేందుకు నిర్వాహకులు అనుమతించారు. ఆమె జాడ కోసం శాంతియుతంగా వ్యవహరించినంతకాలం వాటిని ధరించవచ్చని పేర్కొన్నారు. చైనా క్రీడాకారిణికి మద్దతుగా ధరించిన చొక్కాలు, బ్యానర్లు తీసివేయాలంటూ మెల్బోర్న్ పార్క్‌లో వీక్షకులను భద్రతా సిబ్బంది ఆదేశించిన వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇది అత్యంత దయనీయమైన చర్య అంటూ టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా మండిపడ్డారు. ఇలా పలువురి నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది.
చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్ గవోలి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కొద్దినెలల క్రితం పెంగ్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు చేసింది. జాంగ్ తనతో శృంగారం చేయాలని బలవంతం చేశాడని, ఏడేళ్ల క్రితం అతనితో ఓ సారి శృంగారంలో పాల్గొన్నానని అందులో పేర్కొంది. కానీ తర్వాత ఆ పోస్టును తొలగించడం గమనార్హం. ఆ అనంతరం కొద్ది వారాలు పాటు పూర్తిగా కనిపించకుండా పోయిన ఆమె.. ఆ తర్వాత తాను సురక్షితంగానే ఉన్నట్లు చెప్పింది. కానీ ఇప్పటికీ ఆమె భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ తోటి క్రీడాకారుణులు, అభిమానులు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు.
దీనిలో భాగంగానే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ‘పెంగ్ షువాయి ఎక్కడ?’ అనే చొక్కాలను ధరిస్తున్నారు. అయితే వాణిజ్యపరమైన, రాజకీయ పరమైన బ్యానర్లు, దుస్తులు, సంకేతాలు వినియోగించకూడదనే దీర్ఘకాలిక విధానం గురించి ప్రస్తావిస్తూ.. టెన్నిస్ ఆస్టేలియా ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించింది. అయితే అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో.. ఎటువంటి విఘాతం కలిగించకుండా, శాంతియుతంగా ఆ చొక్కాలను ధరిస్తున్నంతకాలం వాటిని అనుమతిస్తామంటూ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు