Published : 19/09/2021 01:22 IST

Ganguly Biopic: వెండితెరపై ‘దాదా’గా ఆ హీరోకి ఛాన్స్‌ ఇవ్వండి!

గంగూలీ ఫ్యాన్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఎవరి పేరు చెప్పారంటే..

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ‘దాదా బయోపిక్‌’ రాబోతుందంటూ ఇటీవలే లవ్‌ఫిల్మ్స్‌ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి వెండితెర దాదాగా తెరపై ఎవరు కనిపించనున్నారనే ఆత్రుత గంగూలీ ఫ్యాన్స్‌లో మొదలైంది. గతంలో గంగూలీ ఓ సందర్భంలో తన బయోపిక్‌లో హృతిక్‌రోషన్‌, రణ్‌బీర్‌ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే ప్రశ్నను ఆయన అభిమానులను అడిగితే మాత్రం వీరు కాకుండా.. బెంగాలీ నటుడు పరంబ్రత ఛటర్జీ నటిస్తే బాగుంటుందని ఆయనకు అవకాశం ఇస్తే ఆ పాత్రకు న్యాయం చేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందాల వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. రణ్‌బీర్‌ కపూర్‌, హృతిక్‌రోషన్‌.. ఈ ఇద్దరిలో ఒకరు నటిస్తారనే మాట బీటౌన్‌లో వినిపిస్తోంది. అధికారికంగా బయోపిక్‌ వస్తుందని ప్రకటించాక ఎవరు నటిస్తే బాగుంటుందనే ప్రశ్నకు గంగూలీ స్పష్టమైన జవాబు ఇవ్వనప్పటికీ.. రణ్‌బీర్‌పై మక్కువ చూపిస్తున్నట్లు సమాచారం. అయితే హీరో ఎవరన్నది మాత్రం మేకర్స్‌ చేతుల్లో ఉంటుందని చెప్పారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని