యోగాలో ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

మానసిక ప్రశాంతత, మెరుగైన ఆరోగ్యం కోసం చేసే యోగాలో ఇక ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో మొట్టమొదటి యోగాసన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించే దిశగా భారత్‌

Updated : 12 Nov 2021 08:40 IST

దిల్లీ: మానసిక ప్రశాంతత, మెరుగైన ఆరోగ్యం కోసం చేసే యోగాలో ఇక ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో మొట్టమొదటి యోగాసన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్‌వైఎస్‌ఎఫ్‌) అధ్యక్షుడు ఉదిత్‌ సేఠ్‌ ఆ విషయాన్ని ప్రకటించాడు. భువనేశ్వర్‌లో గురువారం తొలి జాతీయ శారీరక యోగాసన ఛాంపియన్‌షిప్స్‌ ఆరంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2022 జూన్‌లో భారత్‌ మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించనుంది. ఇది దేశ వారసత్వ క్రీడను ప్రపంచానికి చాటుతుంది. జాతీయ యోగాసన ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిస్తున్న ఒడిషా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఓ క్రీడగా యోగాసన విధానాన్ని విశిష్టంగా తీర్చిదిద్దాం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారీ స్థాయిలో అథ్లెట్లు రావడం తృప్తినిస్తోంది. యోగాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామనే నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఎన్‌వైఎస్‌ఎఫ్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ గుర్తింపు లభించడంతో అన్ని విభాగాల్లోనూ పోటీలు నిర్వహించేందుకు దానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం కలిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని