Sushil Kumar: బలమైన ఆయుధంతో కొట్టడం వల్లే.. 

రెజ్లర్ సాగర్‌ రాణా తలపై బలమైన ఆయుధంతో దాడిచేయడం వల్లే మృతిచెందాడని పోస్టుమార్టమ్‌ నివేదికలో తేలింది. ఈనెల 4న అర్ధరాత్రి ఛత్రసాల్ స్టేడియంలో అతడితో పాటు ఇద్దరు యువకులపై మరో వర్గం దాడి చేసిన సంగతి తెలిసిందే...

Published : 26 May 2021 01:12 IST

రెజ్లర్ సాగర్‌ రాణా మృతి..

దిల్లీ: రెజ్లర్ సాగర్‌ రాణా తలపై బలమైన ఆయుధంతో దాడిచేయడం వల్లే మృతిచెందాడని పోస్టుమార్టమ్‌ నివేదికలో తేలింది. ఈనెల 4న అర్ధరాత్రి ఛత్రసాల్ స్టేడియంలో అతడితో పాటు ఇద్దరు యువకులపై మరో వర్గం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాగర్‌ మృతిచెందాడు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ప్రస్తుతం రిమాండులో ఉండగా, పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

మరోవైపు సాగర్ పోస్టుమార్టమ్‌ నివేదిక బయటకు రావడంతో మరణానికి గల అసలు నిజాలు తెలిశాయి. అతడి తలపై బలమైన ఆయుధంతో కొట్టడం వల్లే మరణించాడని వైద్యులు కనుగొన్నారు. సాగర్‌ శరీరంపై తల నుంచి మోకాళ్ల వరకు అనేక గాయాలున్నాయని, కొన్ని చోట్ల శరీరంలోని ఎముకలు కూడా విరిగాయని తెలిపారు. ప్రస్తుతం అతడి మృతదేహానికి సంబంధించిన అవయవాలు, బ్లడ్‌ శాంపుల్స్‌ను భద్రపరిచినట్లు తెలిసింది. ఇక ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు మంగళవారం తెల్లవారుజామున సుశీల్‌ను ఛత్రసాల్‌ స్టేడియానికి తీసుకెళ్లారని తెలిసింది. నేరం జరిగిన తీరు తెలుసుకునేందుకు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. దీని ద్వారా అతడి నుంచి మరింత సమాచారం తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని