
Yuvraj Singh: యువరాజ్ సింగ్ మెడలో భారీ కొండ చిలువ!
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్‌సింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో విహరిస్తున్నాడు. అక్కడి ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో ప్రసిద్ధి గాంచిన ‘ఫేమ్ పార్క్’లో స్నేహితులతో సరదాగా గడిపాడు. ‘లైగర్’తో టగ్ ఆఫ్ వార్ ఆడాడు. తాడును ఒకవైపు లైగర్ నోటితో పట్టుకొని ఉండగా.. యువీతోపాటు మరో నలుగురు ఆ తాడును లాగారు. అయినప్పటికీ లైగర్ ఏమాత్రం పడలకుండా అలాగే నిలబడి ఉండటం విశేషం. చింపాంజీ, ఎలుగుబంటి, జిరాఫీలతోపాటు మరికొన్ని జంతువులకు కూడా యువీ స్వయంగా ఆహారాన్ని అందించాడు. లైగర్‌కు మాంసాన్ని తినిపించాడు. అనంతరం ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని మురిసిపోయాడు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యువరాజ్ ఇస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ‘టైగర్ vs లైగర్. చివరకు ఏమవుతుందో మీకు తెలుసు. ఇదో గొప్ప అనుభూతి. నా భయాలను అధిగమిస్తూ, అడవి అందాలను ఆస్వాదించా’ అంటూ ఆ వీడియోకు తన వ్యాఖ్యలను జోడించాడు. జంతువులను సురక్షితంగా చూసుకుంటున్న ఫేమ్ పార్క్ యాజమాన్యాన్ని యువీ కొనియాడాడు. ‘ఫేమ్ పార్క్ స్వర్గధామంలా ఉంది. జంతువులన్నీ సురక్షిత స్థలంలో జీవిస్తున్నాయి. సంరక్షకులు వాటి అవసరాలను చూసుకోవడానికి చాలా బాగా శిక్షణ పొందారు. ఈ వీడియో తీసే సమయంలో జంతువులకు ఎలాంటి హాని జరగలేదు’ అంటూ పోస్టు చేశాడు.
ఇవీ చదవండి
Advertisement