Micro 3D Camera: వెంట్రుకంత కెమెరా

వెంట్రుకంత తీగ. దానికో కెమెరా. ఇది చిన్నదే కావచ్చు గానీ చేతలు మాత్రం చాలా ఘనం. మామూలు ఫొటోలు కాదు, స్పష్టంగా 3డీ ఫొటోలు తీస్తుంది మరి. యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గోకు చెందిన మైల్స్‌ పాడ్జెట్‌

Updated : 11 Aug 2021 16:25 IST

వెంట్రుకంత తీగ. దానికో కెమెరా. ఇది చిన్నదే కావచ్చు గానీ చేతలు మాత్రం చాలా ఘనం. మామూలు ఫొటోలు కాదు, స్పష్టంగా 3డీ ఫొటోలు తీస్తుంది మరి. యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గోకు చెందిన మైల్స్‌ పాడ్జెట్‌ నేతృత్వంలోని బృందం దీన్ని తయారుచేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటిలో కన్నా చాలా చిన్న కెమెరా ఇదే. 50 మైక్రోమీటర్ల వ్యాసం, 40 సెంటీమీటర్ల పొడవు గల ఫైబర్‌ ఆప్టిక్‌ తీగతో అనుసంధానమై పనిచేస్తుంది. సుమారు 2.5 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులను చిత్రీకరిస్తుంది. లైడర్‌ స్కానర్‌ మాదిరిగా పనిచేసే ఇది కాంతి ప్రచోదనాలను వెదజల్లి, అవి తిరిగి వచ్చే వేగాన్ని బట్టి దూరాన్ని పసిగడుతుంది. మిల్లీమీటరు వరకూ కచ్చితత్వంతో వస్తువుల ఆకారాన్ని, పరిమాణాన్ని గుర్తిస్తుంది. ప్రతి సెకండుకు 23,000 కొలతలను తీసుకోగలదు. వీటి ఆధారంగానే తీగకు అవతలి వైపున ఉన్న వస్తువులను 3డీ చిత్రంగా మలచి ముందుంచుతుంది. వైద్యరంగంలోనే కాదు.. పారిశ్రామిక, నిఘా అవసరాలకూ ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని