Published : 23/09/2021 23:21 IST

iPhone Theft: ఐఫోన్ చోరీకి.. ఐఓఎస్‌ 15తో చెక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్దిరోజుల క్రితం ఐఫోన్ 13ని విడుదల చేసిన యాపిల్ తర్వాతి వారంలో ఐఓఎస్ 15 ఓఎస్‌ని విడుదల చేసింది. ఐఓఎస్‌ 14.8 కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ కొత్త ఓఎస్‌లో యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తోపాటు ఫోన్ భద్రతకు సంబంధించి అప్‌డేటెడ్‌ ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. మరీ ముఖ్యంగా ఫోన్‌ పోయినప్పుడు యూజర్స్‌ దాన్ని ట్రాక్‌ చేసేందుకు వీలుగా ఫైండ్‌ మై యాప్‌కు కొత్త ఫీచర్స్‌ జోడించినట్లు యాపిల్ వెల్లడించింది. వీటి సాయంతో యూజర్స్‌ తమ ఫోన్‌ని దొంగలు స్విచ్ఛావ్ చేసినా కూడా ఫోన్‌ ఎక్కడుందనేది తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ ఫీచర్స్‌ ఏంటి.. అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

ఆండ్రాయిడ్‌ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్‌ని లగ్జరీ డివైజ్‌గానే చెప్పోచ్చు. అందుకే ఐఫోన్‌ దొంగతనాలు ఎక్కువగా జరుగతుంటాయి. అయితే ఫోన్‌ పోయినప్పుడు అందులోని డేటా డిలీట్‌ చేసినా, ఫోన్‌ని స్విచ్ఛాఫ్‌ చేసినా దాన్ని కనుక్కోవడం యూజర్‌కి సాధ్యపడటంలేదు. దీంతో ఫోన్‌ని ట్రేస్‌ చేసేందుకు సులువుగా ఉండే ఫీచర్స్ తీసుకురావాలని ఎంతో కాలంగా యూజర్స్ యాపిల్‌ను కోరుతున్నారు. యూజర్స్ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న యాపిల్ ఫైండ్‌ మై యాప్‌లో కొత్త ఫీచర్స్‌ని యాడ్ చేసింది. అంతేకాకుండా మనం పోగొట్టుకున్న డివైజ్‌ బ్యాటరీ తక్కువగా ఉన్నా అది మరో యాపిల్‌ డివైజ్‌కి దగ్గర్లో ఉంటే దాన్ని కనుక్కోవచ్చు.

ఇందుకోసం యూజర్స్‌ తమ ఐఫోన్‌లో ఫైండ్ మై నెట్‌వర్క్‌ పీచర్‌ను ఎనేబుల్ చేసుండాలి. ఒకవేళ ఈ ఫీచర్ డిసేబుల్ చేసుంటే మాత్రం తప్పక దాన్ని ఎనేబుల్ చేయాలని తెలిపింది. దీని సాయంతో యూజర్స్ తమ ఐఫోన్ పోగొట్టుకున్న తర్వాత స్విచ్ఛాఫ్ చేసినా 24 గంటల్లోగా దాన్ని కనుక్కోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌ని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నించినా.. అందులోని హలో స్క్రీన్‌.. ఫోన్ లాక్‌ అయిందని, దాన్ని ట్రాక్‌ చేయగలరనే సమాచారాన్ని కొనుగోలు చేసే వ్యక్తికి తెలియజేస్తుందని యాపిల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. అలానే యూజర్స్‌ ఫైండ్‌ మై యాప్‌లోని సెపరేషన్‌ అలర్ట్‌ని కూడా ఎనేబుల్ చేయాలని సూచించింది. దీని సాయంతో ఇంట్లో మీరు ఫోన్‌ ఎక్కడ మరిచిపోయారనేది కూడా తెలుసుకోవచ్చు. 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని