Updated : 03/01/2021 22:24 IST

ఫౌజీ వచ్చేస్తున్నాడు..ఎప్పుడంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గేమర్స్‌కి గుడ్‌న్యూస్‌. పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఫౌజీ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌) గేమ్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న ఫౌజీ గేమ్‌ను విడుదల చేస్తున్నట్లు ఎన్‌కోర్ గేమ్స్‌ సంస్థ తెలిపింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా గేమ్‌ విడుదలపై ప్రకటన చేసింది. ఇదే విషయాన్ని గేమ్‌కి మెంటార్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ కూడా ట్విటర్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా భారత జవాన్లు గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో తలపడుతున్న దృశ్యాలతో కూడిన కొత్త టీజర్‌ గేమ్‌పై మరింత ఆసక్తి పెంచేలా ఉంది.

భారత్‌లో పబ్‌జీపై నిషేధం తర్వాత ఫౌజీ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు గతేడాది జులైలో ప్రకటించారు. ఆ తర్వాత విజయదశమి సందర్భంగా తొలి టీజర్‌ను విడుదల చేశారు. 2020 డిసెంబరు నెలలో గేమ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా 24 గంటల్లో ఒక మిలియన్‌ రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. తాజాగా రిపబ్లిక్‌ డే సందర్భంగా గేమ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గేమ్‌ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా దేశ సైనికుల త్యాగాలను తెలియజెప్పేలా ఉంటుందని గతంలో అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. ఫౌజీని బెంగళూరుకి చెందిన స్టూడియో ఎన్‌కోర్ గేమ్స్‌ అనే సంస్థ రూపొందించింది.


Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని