ఈ ఫోన్‌ హాట్‌ గురూ!

తక్కువ ధరలో, పెద్ద బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారి కోసం ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ హాట్‌ 10 ప్లే పేరుతో కొత్త ఫోన్‌ను సిద్ధం చేసింది. వచ్చే వారం నుంచి అమ్మకానికి రానుంది.

Published : 21 Apr 2021 01:14 IST

క్కువ ధరలో, పెద్ద బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారి కోసం ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ హాట్‌ 10 ప్లే పేరుతో కొత్త ఫోన్‌ను సిద్ధం చేసింది. వచ్చే వారం నుంచి అమ్మకానికి రానుంది. మీడియా టెక్‌ హీలియో జీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. వెనుక రెండు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, అడుగున 3.5 ఎంఎం ఆడియోజాక్‌ ఉంటాయి. ప్రత్యేకంగా మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ కూడా ఉంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజీతో కూడిన హాట్‌ 10 ప్లే ధర రూ.8,499 ఉండొచ్చని అంచనా. ఫోన్‌తో పాటు జియో ఆఫర్‌ సైతం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని