మాస్కులో ఆక్సిజన్‌

మనం ధరించే మాస్కే ఆక్సిజన్‌ను సృష్టిస్తే? ఆక్సిజన్‌ కొరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది కదా.

Published : 05 May 2021 00:42 IST

నం ధరించే మాస్కే ఆక్సిజన్‌ను సృష్టిస్తే? ఆక్సిజన్‌ కొరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. మదురై కామరాజ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అరోకియా దాస్‌ ఇలాగే ఆలోచించారు. నానో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వినూత్నమైన, చవకైన మాస్కును రూపొందించారు. విద్యుదయస్కాంత శక్తితో పనిచేసే ఇది వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను వేరుచేసి, మాస్కులోని రెస్పిరేటర్‌లోకి చేరవేస్తుంది. ఇది ఊపిరితిత్తుల మీద ఎలాంటి ఒత్తిడి కలిగించకుండానే మనం శ్వాసించే తీరును గమనిస్తూ తనకు తానుగానే ఆక్సిజన్‌ను తయారుచేసే పనిని ఆరంభించటం విశేషం. వాతావరణంలోని 20.9% ఆక్సిజన్‌ను 33% ఆక్సిజన్‌ రూపంలోకి మారుస్తుంది. ఇంట్లో వాడుకునే చిన్న మాస్కు రూ.250 మాత్రమే ఖర్చవుతుంది. అదే పెద్ద మాస్కులైతే రూ.5వేల వరకు ధర పెట్టాల్సి ఉంటుంది. బ్యాటరీ సాయంతో పనిచేసే దీని బరువు 100 గ్రాములు. మాస్కును రీఛార్జ్‌ కూడా చేసుకోవచ్చు. కొవిడ్‌ విజృంభణతో ఆక్సిజన్‌ అవసరం రోజురోజుకీ పెరుగుతున్నందున దీని వినియోగానికి అనుమతి లభిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని