యూట్యూబ్‌లో పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌

యూట్యూబ్‌లో కొత్తగా పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ (పీఐపీ) ఫీచర్‌ వచ్చేసింది. ప్రస్తుతానికి ఇది యాపిల్‌ ఫోన్‌ ఉపయోగించే వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఏంటీ పీఐపీ అంటే.. సాధారణంగా యూట్యూబ్‌ ఆన్‌ చేయగానే సగం తెరపై వీడియో ప్లే అవుతుంటుంది. ఫుల్‌ స్క్రీన్‌ మోడ్‌ పెడితే తెర మొత్తం కనిపిస్తుంది. అలా కాకుండా పీఐపీ ఫీచర్‌ ...

Updated : 30 Jun 2021 06:39 IST

యూట్యూబ్‌లో కొత్తగా పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ (పీఐపీ) ఫీచర్‌ వచ్చేసింది. ప్రస్తుతానికి ఇది యాపిల్‌ ఫోన్‌ ఉపయోగించే వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఏంటీ పీఐపీ అంటే.. సాధారణంగా యూట్యూబ్‌ ఆన్‌ చేయగానే సగం తెరపై వీడియో ప్లే అవుతుంటుంది. ఫుల్‌ స్క్రీన్‌ మోడ్‌ పెడితే తెర మొత్తం కనిపిస్తుంది. అలా కాకుండా పీఐపీ ఫీచర్‌ ఉపయోగిస్తే ఫోన్‌ తెరపై ఒక చిన్న తెర ప్రత్యక్షం అవుతంది. దాన్ని ఎడమకు, కుడికి, కిందికి, పైకి.. ఎటువైపు కావాలంటే అటువైపు జరుపుకోవచ్చు. దాన్ని అలాగే ఉంచి ఫోన్‌లో మిగతా పని చేసుకోవచ్చు. ఫుల్‌ స్క్రీన్‌ కావాలనుకుంటే వీడియోపై రెండుసార్లు క్లిక్‌ చేస్తే సరి. ప్రస్తుతం ప్రీమియం యూజర్లకే ఈ అవకాశం కల్పిస్తున్నా తర్వాత అందరికీ అందుబాటులోకి తెస్తామంటోంది యూట్యూబ్‌. యాప్‌తోపాటు బ్రౌజర్‌, క్రోమ్‌లతో కూడా దీన్ని వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని