39% ఒంటరితనంతోనే

కొవిడ్‌ విజృంభణతో ఉద్యోగ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇంటి నుంచే పని. సహోద్యోగులతో ముఖాముఖి సంభాషణ గగనమైపోయింది. డిజిటల్‌ సంబంధాల ప్రాధాన్యం పెరిగిపోయింది.

Updated : 24 Nov 2021 17:05 IST

కొవిడ్‌ విజృంభణతో ఉద్యోగ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇంటి నుంచే పని. సహోద్యోగులతో ముఖాముఖి సంభాషణ గగనమైపోయింది. డిజిటల్‌ సంబంధాల ప్రాధాన్యం పెరిగిపోయింది. ఐటీ ఉద్యోగుల్లో చాలామంది.. అంటే దాదాపు 61% మంది వీటికి అనుగుణంగా మారారు గానీ ఇప్పటికీ 39% మంది ఒంటరితనం భావనతోనే గడుపుతున్నారు. ప్రముఖ  సైబర్‌ భద్రత సంస్థ కాస్పర్‌స్కీ నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయమిది. డిజిటల్‌ సమాచార సాధన సంపత్తికి అలవాటు పడినవారిలో చాలామంది కంపెనీ సర్వీసులకు బదులు ప్రైవేటు సేవలను వినియోగించుకుంటుండటం గమనార్హం. ఇది ఆయా కంపెనీల భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముందని భావిస్తున్నారు. ఇక ఒంటరితనంతో బాధపడుతున్నామని అనుకునేవారిలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, ఆగ్రహం కట్టలు తెంచుకోవటం వంటివి తలెత్తొచ్చు. ఇవి పై అధికారులకు ఇబ్బందికరంగానూ పరిణమించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని