డీఎన్ఏ ప్లాస్టిక్!
జన్యు పదార్థంతో (డీఎన్ఏ) ప్లాస్టిక్! మీరు చదివింది నిజమే. ఇదో కొత్తరకం ప్లాస్టిక్. పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. దీన్ని తయారు చేయటానికి పెద్దగా ఇంధనమూ అవసరం లేదు. తేలికగా ముక్కలు చేసి, ఇతర వస్తువులుగా మార్చుకోవచ్చు.
జన్యు పదార్థంతో (డీఎన్ఏ) ప్లాస్టిక్! మీరు చదివింది నిజమే. ఇదో కొత్తరకం ప్లాస్టిక్. పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. దీన్ని తయారు చేయటానికి పెద్దగా ఇంధనమూ అవసరం లేదు. తేలికగా ముక్కలు చేసి, ఇతర వస్తువులుగా మార్చుకోవచ్చు. పునర్వినియోగానికి సాధ్యం కాని పెట్రో రసాయనాలతో తయారయ్యే సంప్రదాయ ప్లాస్టిక్స్ పర్యావరణానికి హాని చేస్తాయి. వీటిని తయారుచేయటానికి ఎక్కువ ఉష్ణోగ్రత, విషతుల్య రసాయనాలు కావాలి. ఇవి క్షీణించటానికి వందలాది ఏళ్లు పడుతుంది. అందుకే ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. మొక్కజొన్న పిండి, నాచు వంటి వాటితో తయారయ్యే ప్లాస్టిక్‌లకు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పెరుగుతోంది. ఇవి త్వరగానే క్షీణిస్తాయి. పునర్వియోగించుకోవచ్చు కూడా. కాకపోతే వీటి తయారీకి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. ముక్కలుగా విరగ్గొట్టటం కష్టం. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికే చైనాలోని టియాంజిన్ యూనివర్సిటీ పరిశోధకులు డీఎన్ఏ ప్లాస్టిక్‌పై దృష్టి సారించారు. ముందుగా వంట నూనెల నుంచి తీసిన రసాయనానికి చిన్న డీఎన్ఏ పోచలను అనుసంధానం చేసి మెత్తటి జిగురుద్రవాన్ని సృష్టించారు. దీన్ని అచ్చులలో పోసి, శీతలీకరించారు. దీంతో జిగురు ద్రవంలోని నీరు బయటకు వెళ్లిపోయి, గట్టిపడింది. ఆయా అచ్చుల ఆకారాల్లో స్థిరపడిపోయింది. దీని ద్వారా కప్పుల వంటి రకరకాల వస్తువులను రూపొందించారు. వీటిని నీటిలో ముంచగా తిరిగి జిగురుద్రవంగా మారటం గమనార్హం. దీన్ని ఇతరత్రా వస్తువులను తయారు చేసుకోవటానికి తిరిగి వాడుకోవచ్చు. మరో మంచి విషయం ఏంటంటే- ఈ ప్టాస్టిక్ తయారీలో ఉపయోగపడే డీఎన్ఏ అంతటా అందుబాటులో ఉండటం. మన భూమ్మీద 5వేల కోట్ల టన్నుల డీఎన్ఏ ఉందని అంచనా. ప్రస్తుతానికి సాల్మన్ చేప వీర్యం నుంచి సేకరించిన డీఎన్ఏతో ఈ ప్లాస్టిక్‌ను రూపొందించినా.. పంట వ్యర్థాలు, ఆల్గే, బ్యాక్టీరియా డీఎన్ఏనూ దీనికి వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డీఎన్ఏ ప్లాస్టిక్ తయారీకి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరముండదు కాబట్టి 97% వరకు కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. అవసరం తీరాక డీఎన్ఏను జీర్ణం చేసుకునే ఎంజైమ్ సాయంతో దీన్ని తేలికగా విచ్ఛిన్నం చేసుకోవచ్చు. కాకపోతే ఇది మామూలు ప్లాస్టిక్ అంత దృఢంగా ఉండదు. పొడిగా ఉండేలా చూసుకోవటమూ ముఖ్యమే. ఈ రెండు ఇబ్బందులనూ అధిగమించగలిగితే మరింత ఎక్కువగా వినియోగంలోకి రాగలదని ఆశిస్తున్నారు.
ఈ ప్టాస్టిక్ తయారీలో వాడే డీఎన్ఏ అంతటా అందుబాటులో ఉంటుంది. మన భూమ్మీద 5వేల కోట్ల టన్నుల డీఎన్ఏ ఉందని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్‌ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్